- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెంగాల్‌లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది: రాహుల్ గాంధీ
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో వైద్య విద్యార్థిపై లైంగిక దాడి చేసి, దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డ జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో గత మూడు రోజులు దేశవ్యాప్తంగా నిరసన కొనసాగుతుండగా.. పలువురు రాజకీయ నాయకులు కారిగా అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన ట్వీట్‌లో "కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఆమెపై క్రూరమైన, అమానుషమైన చర్యకు సంబంధించిన దారుణంతో వైద్యులు, మహిళల్లో అభద్రతా వాతావరణం నెలకొంది.
బాధితురాలికి న్యాయం చేయకుండా.. నిందితుడిని రక్షించే ప్రయత్నం చేయడం సదరు ఆసుపత్రి, స్థానిక ప్రభుత్వ పాలన పై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని.. మెడికల్ కాలేజీ లాంటి చోట డాక్టర్లకే భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను బయటికి పంపిస్తే ఎలా అని ఆలోచించేలా ఈ ఘటన చేసిందని.. నిర్భయ కేసు తర్వాత చేసిన కఠిన చట్టాలు కూడా ఇలాంటి నేరాలను అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యాయని ప్రశ్నించారు. అలాగే.. బాధిత కుటుంబానికి తాను అండగా నిలుస్తున్నానని. వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ న్యాయం జరగి.. దోషులకు తగిన శిక్ష విధించి.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చూసుకొవాలని రాహుల్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.