వేగంగా జరుగుతున్న రామేశ్వరం ద్వీపం కొత్త రైల్వే వంతెన నిర్మాణం

by Mahesh |
వేగంగా జరుగుతున్న రామేశ్వరం ద్వీపం కొత్త రైల్వే వంతెన నిర్మాణం
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం రామేశ్వరం ద్వీప ప్రాంతానికి ముఖ ద్వారం అయిన పంబన్ వద్ద కొత్త రైల్వే వంతెన నిర్మిస్తున్నారు.ఈ పనులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తుంది. రైల్వే వంతెన కు సంబంధించి 1.6 కి.మీ మేర 100% పనులు పూర్తి కాగా, మిగిలిన 500 మీటర్ల పనులు జరుగుతున్నాయి. ఈ పూర్తి వంతెనను 2020 సంవత్సరంలో రూ. 550 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. పాంబన్ వంతెనకు సమాంతరంగా ఉన్న ఈ కొత్త వంతెన కనెక్టివిటీని మెరుగుపరచడంతో ఆ ప్రాంతంలో రవాణాను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన ముందడుగు. 333 పైల్స్, 101 పైల్ క్యాప్స్‌తో సబ్‌స్ట్రక్చర్‌ను పూర్తి చేయడంతోపాటు, లిఫ్ట్ స్పాన్ ఫ్యాబ్రికేషన్‌తో సహా 99 అప్రోచ్ గిర్డర్‌లలో 76ని ప్రారంభించారు. కొత్త పంబన్ వంతెన 2,070-మీటర్ల (6,790 అడుగులు) పొడవు గల నిలువు లిఫ్ట్ సముద్ర వంతెన, ఇది తమిళనాడులోని రామేశ్వరం వద్ద ప్రస్తుతం ఉన్న పాంబన్ వంతెనకు సమాంతరంగా నిర్మించబడుతుంది. ఈ నిర్మాణం భారతదేశపు మొదటి నిలువు లిఫ్ట్ సముద్ర వంతెన అవుతుంది. కొత్త వంతెన సముద్రం మీదుగా 100 స్పాన్‌లను కలిగి ఉంటుంది. వీటిలో 99 18.3 మీటర్లు ఉండగా.. వాటిలో ఒకటి 72.5 మీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వంతెన కంటే ఇది 3 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

Next Story

Most Viewed