మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

by GSrikanth |   ( Updated:2023-09-21 16:52:45.0  )
మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు 215 మంది సభ్యులు ఆమోదం తెలిపారు. కాగా, ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు తాజాగా రాజ్యసభలో ఆమోదం లభించింది. దీనిపై సభలో సుదీర్ఘంగా చర్చ నిర్వహించారు. చర్చ అనంతరం బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించారు. అయితే, ఈ బిల్లుకు విపక్ష సభ్యులు సైతం మద్దతు తెలపడంతో బిల్లు ఆమోదం పొందడం లాంఛనమైంది. రాష్ట్రపతి ముద్రతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. అయితే, నియోజకవర్గాల పునర్విభజన పూర్తైన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.

Advertisement

Next Story