- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
33 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ లిస్ట్ రిలీజ్.. కీలక నేతలకు సీట్లు ఖరారు..!
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పార్టీలు స్పీడ్ పెంచాయి. అధికారమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నాయి. సర్వేలు, విజయవకాశాలు, ఇతర ఈక్వేషన్స్ అన్నింటిని పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఇక, ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 33 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది.
పార్టీలోని కీలక నేతలకు ఈ ఫస్ట్ లిస్ట్‌లో చోటు దక్కింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సదర్‌పురా నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నారు. డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ టోంక్ స్థానం నుండి పోటీ చేయనున్నారు. మరో కీలక నేత సీపీ జోషి నథ్వారా సెగ్మెంట్ నుండి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రతిపక్ష బీజేపీ సైతం తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ఇవాళే విడుదల చేసింది. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన బీజేపీ.. శనివారం 83 మందితో సెకండ్ లిస్ట్‌ను విడుదల రిలీజ్ చేసింది. సెకండ్ లిస్ట్‌లో రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజేకు చోటు దక్కింది.