Rajasthan: స్కూళ్లకు కత్తులు, పదునైన వస్తువులు తీసుకెళ్లడంపై నిషేధం

by Shamantha N |
Rajasthan: స్కూళ్లకు కత్తులు, పదునైన వస్తువులు తీసుకెళ్లడంపై నిషేధం
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లకు కత్తులు, కత్తెరలు లేదా పదునైన వస్తువులు తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ మార్గదర్శాలకు జారీ చేసింది. శుక్రవారం ఉదయ్ పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి సహచరులపై కత్తితో దాడి చేశాడు. దీంతో హింస చెలరేగింది. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మార్గదర్శకాల ప్రకారం టీచర్లు విద్యార్థుల స్కూల్ బ్యాగులను తనిఖీ చేయాలి. పదునైన వస్తువులు స్కూల్ తెచ్చి నిబంధనలు ఉల్లఘించిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రాజస్థాన్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ఆశిష్ మోడీ మాట్లాడుతూ తమ పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు స్కూళ్లకు పంపుతున్నారని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాల ప్రాంగణాలు విద్యార్థులకు అత్యంత సురక్షితమైన ప్రదేశంగా ఉండాలని అన్నారు. స్కూళ్లలో ఎలాంటి హింస జరగకుండా విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ప్రతిస్కూల్ లోని నోటీసు బోర్డులపై కొత్త మార్గదర్శకాలను అంటిచేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అసెంబ్లీ సమయంలో విద్యార్థులకు ఆ నోటీసుల గురించి తెలుపుతామన్నారు.

విద్యార్థిపై కత్తిదాడి

ఉదయ్ పూర్ లోని భటియాని చౌహట్టా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 15 ఏళ్లున్న ఇద్దరు విద్యార్థుల మద్య మధ్యహ్న భోజన సమయంలో గొడవ జరిగింది. ఆ తర్వాత ఒక విద్యార్థిపై మరొకరు కత్తితో పొడిచారని ఉదయ్ పూర్ జిల్లా విద్యాధికారి తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. గుంపుని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. భారతీయ నాగరిక్ సురక్ష సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు

Advertisement

Next Story

Most Viewed