రాహుల్ హిందువులకు అన్యాయం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యలు

by samatah |
రాహుల్ హిందువులకు అన్యాయం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే విమర్శలు గుప్పించారు. రాహుల్ పాదయాత్ర ద్వారా బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నారని..హిందువులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జోడో యాత్రలో ముస్లింలందరూ పాల్గొన్నారని దానికి సంబంధించిన ఆధారాలు సైతం తన దగ్గర ఉన్నాయని చెప్పారు. రాహుల్ ఇప్పటి వరకు సందర్శించిన ప్రదేశాలు..ముర్షిదాబాద్, మాల్దా, కిషన్ గంజ్, కతిహార్, పూర్నియా, పాకూర్, సాహిబ్ గంజ్, గొడ్డా ఇవన్నీ బంగ్లా చొరబాటుదాల కేంద్రాలేనని స్పష్టం చేశారు. ‘రాహుల్ హిందువు కాదు. అయినప్పటికీ హిందువుగా ప్రకటించుకోవాలనుకుంటే మేము స్వాగతిస్తాం. కానీ హిందూ ప్రాంతాల్లో కూడా పర్యటించండి’ అని చెప్పారు. సెక్యులరిజం పేరుతో రాహుల్ ముస్లింలను మభ్యపెడుతున్నారన్నారు. కాగా, జనవరి 14న మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రను రాహుల్ ప్రారంభించారు.100 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్లు, 110 జిల్లాల్లో 6,713 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్ర జార్ఖండ్‌లో కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed