Rahul Gandhi: ఫస్ట్ చరిత్ర చదవండి.. ఆ తర్వాత ప్రసంగాలు చేయండి

by Shamantha N |
Rahul Gandhi: ఫస్ట్ చరిత్ర చదవండి.. ఆ తర్వాత ప్రసంగాలు చేయండి
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై(Rahul Gandhi) రాజకుటుంబవారసుడు, కేంద్రమంత్రి జోతిరాదిత్య సింధ్యా(Jyotiraditya Scindia) ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వంనాటి పరిస్థితులు తెచ్చేందుకు బీజేపీ (BJP), ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS)లు ప్రయత్నిస్తున్నాయన్న రాహుల్ కామెంట్లపై విమర్శలు గప్పించారు. "రాహుల్ గాంధీ.. మొదట చరిత్రను చదవండి, ఆ తర్వాత ప్రసంగాలు చేయండి" అని మండిపడ్డారు. స్వాతంత్ర్యానికి పూర్వం రాజులకు తప్ప వెనకబడిన వర్గాలకు ఎలాంటి అధికారాలు లేవని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. మహారాజులు ప్రజల కోసం ఏం చేశారో ముందు తెలుసుకొని తరువాత ఇలాంటి వ్యాఖ్యలు చేయాలన్నారు. బరోడా రాజు సాయాజీరావ్‌ గైక్వాడ్ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విద్యకు సాయం చేశారని గుర్తు చేశారు. “ 1902లో షాహూజీ మహారాజ్ వెనకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి.. సామాజిక న్యాయానికి పునాది వేశారు. గ్వాలియర్ మాధవ్ మహారాజ్ వెనకబడిన తరగతుల సాధికారత కోసం విద్య, ఉద్యోగ కేంద్రాలను స్థాపించారు.” అని రాహుల్ పై మండిపడ్డారు.

రాహుల్ పై విమర్శలు

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే నిప్పులు చెరిగారు. నిర్లక్ష్య 'హిట్-అండ్-రన్' రాజకీయాలకు రాహుల్ గాంధీయే ఉదాహరణ అని విమర్శించారు. చరిత్రను అర్థం చేసుకోకుండా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రోజూ రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని తిరిగే రాహుల్ అధికార కాంక్షతోనే అలా మాట్లాడుతున్నారని ఎంపీ దుశ్యంత్‌ సింగ్‌ (MP Dushyant Singh) మండిపడ్డారు. ధోల్పూర్ రాజ కుటుంబీకులు సామాజిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కూడా కీలకపాత్ర పోషించారు. రాజులు ప్రజలకు చేసిన సహాయాలను విస్మరించడం రాహుల్‌ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. “మహారాజ్ రాణా నిహాల్ సింగ్ పరిపాలనను మెరుగుపరిచారు. అప్పట్లోనే ఆయన రహదారులు, ఆసుపత్రులు, రైల్వేలు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించారు” అని గుర్తుచేశారు. రాహుల్ కు నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం అలవాటేనని.. ఇప్పటికైనా వాటినుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలపై ఆలోచించాలని సూచించారు. దళితులు, వెనకబడిన తరగతుల వారి హక్కులను కాలరాసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed