BREAKING: తీవ్ర ఉత్కంఠకు తెర.. వయనాడ్ MP సీటును వదలుకోనున్న రాహుల్ గాంధీ

by Satheesh |   ( Updated:2024-06-17 14:33:31.0  )
BREAKING: తీవ్ర ఉత్కంఠకు తెర.. వయనాడ్ MP సీటును వదలుకోనున్న రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రెండు లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రెండు చోట్ల ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీ ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. దీంతో రాహుల్ గాంధీ తన సిట్టింగ్ స్థానమైన వయనాడ్‌ను వదులుకుంటారా..? లేక కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్ బరేలి నుండి తప్పుకుంటారా..? అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఏ స్థానంలో కొనసాగాలి అన్న దానిపై నిర్ణయం తీసుకునేందుకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ సోమవారం కీలక భేటీ నిర్వహించింది. ఈ భేటీకి కాంగ్రెస్ మాజీ అధినేత్రి, ఎంపీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు. రాహుల్ రాజీనామా చేయాల్సిన సీటు విషయంపై తీవ్రంగా చర్చించారు. అనంతరం రాహుల్ గాంధీ వయనాడ్‌ ఎంపీ సీటుకు రాజీనామా చేసి.. రాయ్ బరేలి నుండి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను క్షేతస్థాయిలో బలోపేతం చేసే వ్యూహాంలో భాగంగానే రాహుల్‌ను రాయ్ బరేలీ లోక్ సభ స్థానం నుండే కంటిన్యూ చేస్తున్నారు. దీంతో రాహుల్ ఏ స్థానానికి రిజైన్ చేస్తారన్న నరాలు తెగే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.

Advertisement

Next Story

Most Viewed