- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ జీ ఈ కష్ట సమయంలో మా ప్రేమ, మద్దతు మీకు ఉంటుంది: రాహుల్ గాంధీ ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ బుధవారం తీవ్ర అస్వస్థతకు గురి అయిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రధాని మోడీ తల్లి అవస్వస్థతకు గురి అయిందనే విషయం తెలియగానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె త్వరగ కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ''తల్లి, కొడుకుల మధ్య ప్రేమ శాశ్వతమైనది మరియు వెలకట్టలేనిది. మోడీ జీ, ఈ కష్ట సమయంలో నా ప్రేమ, మద్దతు మీకు ఉంది. మీ అమ్మ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను'' అని రాహుల్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. హీరాబెన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇక, ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తల్లిని చూసేందుకు ప్రధాని మోడీ అహ్మదాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా మెహతా ఆసుపత్రికి వెళ్లారు. తల్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.