Rahul Gandhi: జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రాహుల్ గాంధీ

by Shamantha N |
Rahul Gandhi: జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు (Jammu and Kashmir Assembly polls) జరుగుతున్నాయి. కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. జుమ్ముకశ్మీర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని(Congress election campaign) ప్రారంభించారు. రాంబన్, అనంతనాగ్ జిల్లాల్లో రెండు మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 18న జరగనున్న తొలి దశ ఎన్నికల్లో(first phase polls) పోటీ చేసే కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల కోసమే ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీతో(Rahul Gandhi) పాటు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(, Congress president Mallikarjun Kharge), కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ వాద్ర (Priyanka Gandhi Vadra) ర్యాలీల్లో ప్రసంగించనున్నారు. జమ్ముకశ్మీర్ లో 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ర్యాలీ నిర్వహించనున్నారు.

రాంబన్, దురులో ర్యాలీ

జమ్ముకశ్మీర్ పీసీసీ(JKPCC) చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా(Tariq Hamid Karra) మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ రాంబన్ లో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. బనిహాల్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న వికార్ రసూల్ వనీకి(Vikar Rasool Wani) మద్దతుగా ర్యాలీలో ప్రసంగిస్తారని అన్నారు. దురు స్థానం నుంచి పటీ చేస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్(Ghulam Ahmed Mir) తరఫున ప్రచారం చేపడతారు. ఇకపోతే, జమ్ముకశ్మీర్ లో మూడు దశల అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో పోటీ చేయనుండగా కాంగ్రెస్ 32 స్థానాల నుంచి బరిలో దిగనుంది. ఇకపోతే, జమ్ముకశ్మీర్ లోని 90 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు రానున్నాయి.

Advertisement

Next Story