- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమిత్‌షాపై విమర్శలు.. రాహుల్ గాంధీకి సమన్లు
లక్నో : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై 2018 సంవత్సరంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సమన్లు జారీ అయ్యాయి. జనవరి 6న కోర్టుకు హాజరుకావాలని యూపీలోని సుల్తానాపూర్ ఎంపీ-ఎమ్మెల్యేల న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. శనివారం రోజే కోర్టుకు రాహుల్ గాంధీ హాజరుకావాల్సి ఉండగా.. గైర్హాజరయ్యారు. దీంతో మరోసారి సమన్లు జారీ అయ్యాయి. అమిత్‌షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత విజయ్ మిశ్రా 2018 ఆగస్టు 4న కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది నవంబర్ 18న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి.
అయితే తీర్పును రిజర్వ్ చేస్తూ.. తదుపరి విచారణను న్యాయస్థానం నవంబర్ 27కు వాయిదా వేసింది. అయితే అదే సమయంలో డిసెంబర్ 16న కోర్టుకు హాజరు కావాలంటూ రాహుల్ గాంధీకి జడ్జి యోగేశ్ యాదవ్ సమన్లు జారీ చేశారు. కాగా, ‘‘బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి.. హత్య కేసులో నిందితుడనే విషయాన్ని దేశ ప్రజలు మర్చిపోయారు. కానీ అదే నిజం. నీతి, నిజాయితీ గురించి మాట్లాడే పార్టీ హత్య కేసు నిందితుడిని అధ్యక్షుడిగా పెట్టుకుంది’’ అంటూ 2018లో నాటి బీజేపీ చీఫ్ అమిత్ షాపై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.