యూకేలో రాహుల్ గాంధీ భారత్‌ను అవమానించారు.. క్షమాపణ చెప్పాల్సిందే: రక్షణ మంత్రి

by Mahesh |
యూకేలో రాహుల్ గాంధీ భారత్‌ను అవమానించారు.. క్షమాపణ చెప్పాల్సిందే: రక్షణ మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ రెండో విడత సభలు ఈ రోజు తిరిగి ప్రారంభం అయ్యాయి. సభలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ లండన్‌లో భారత్‌ను అవమానించారని, ఆయన వ్యాఖ్యలను లోక్‌సభ సభ్యులందరూ ఖండించాలని అన్నారు. అలాగే రాహుల్ గాంధీ సభ ముందు క్షమాపణలు చెప్పాలని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

కాగా రాహుల్ గాంధీ ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అదే సమయంలో విపక్షాలు సభలో ఆందోళన చేయడంతో సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. కాగా రాహుల్ గాంధీ చాథమ్ హౌస్ చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రజాస్వామ్యం పై "దాడి చేయబడుతోంది.. బెదిరింపులకు గురవుతోంది" అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed