సంపద పంచుతారన్న మోడీ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రాహుల్ గాంధీ

by Dishanational6 |
సంపద పంచుతారన్న మోడీ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ మేనిఫెస్టోలో సామాజిక ఆర్థిక సర్వే హామీ రాజకీయంగా చిచ్చురేపింది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రజల దగ్గరున్న బంగారంతో సహా సంపదంతా సర్వే చేసి అందరికీ పంచుతామని కాంగ్రెస్ చెప్తుందని మోడీ విమర్శలు గుప్పించారు. ఇది కాస్తా.. వివాదాస్పదంగా మారింది. తాజాగా.. దీనిపైన రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు.

ఢిల్లీలో జరిగిన పార్టీ సామాజిక న్యాయ సమ్మేళన్‌ కార్యక్రమంలో రాహుల్‌ ఈ వివాదాన్ని ప్రస్తావించారు. సర్వే తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పలేదని స్ఫష్టం చేశారు. సంపదను పంచిపెడతామని ఎక్కడా చెప్పలేదన్నారు. దేశంలో ఎంతమందికి అన్యాయం జరిగిందనేదాన్ని తెలుసుకునేందుకు సర్వే చేస్తామని చెప్తున్నామన్నారు. అన్యాయం గురించి మాట్లడగానే మోడీ ఎలా స్పందించారో చూడండని పైర్ అయ్యారు. దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నామని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ, ఈ సర్వేతో అసలు సమస్య ఏంటో, ఎక్కడుందో అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. దేశభక్తులం అని చెప్పుకొనేవారు.. సామాజిక-ఆర్థిక సర్వేతో ముడిపడిన కులగణనకు భయపడుతున్నారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. కులగణనను ఎవరూ ఆపలేదని, వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన చేపడతామన్నారు. ఈ దేశంలో అన్యాయానికి గురైన 90శాతం మందికి న్యాయం కల్పించడమే తమ జీవిత ధ్యేయమని తెలిపారు.



Next Story

Most Viewed