- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ అమేథీ ప్రజలను మోసం చేశారు: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ విమర్శలు గుప్పించారు. రాహుల్ అమేథీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కేరళలోని వయనాడ్ సెగ్మెంట్‌లో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌కు మద్దతుగా గురువారం నిర్వహించిన ర్యాలీలో స్మృతీ ఇరానీ పాల్గొని మాట్లాడారు. యూపీ ప్రజలను మోసం చేసిన రాహుల్ వయనాడ్‌లోనూ ఆ తరహా చర్యలకు పాల్పడేందుకే ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 50ఏళ్ల పాటు కుటుంబ రాజకీయాల పేరుతో అమేథీని భ్రష్టు పట్టించారని చెప్పారు. రాహుల్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. పీఎఫ్ఐ వంటి తీవ్రవాద సంస్థలపై నిషేధం విధించినప్పటికీ రాహుల్ వారి మద్దతు తీసుకోవడం చూసి ఆశ్యర్యపోయానన్నారు. ముస్లిం లీగ్ మద్దతు పొందడం కూడా సిగ్గుచేటని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాతే దేశం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. కాగా, వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో బీజేపీ కేరళ రాష్ట్ర చీఫ్ సురేంద్రన్‌ను బరిలో నిలిపింది.