70 శాతం ఎంపీ ఫండ్స్‌ను సోనియాగాంధీ ముస్లింలకే వెచ్చించారు : అమిత్‌షా

by Shamantha N |
70 శాతం ఎంపీ ఫండ్స్‌ను సోనియాగాంధీ ముస్లింలకే వెచ్చించారు : అమిత్‌షా
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై విరుచుకుపడ్డారు కేంద్రహోంమంత్రి అమిత్ షా. సోనియా గాంధీ తన ఎంపీ నిధుల్లో 70 శాతానికి పైగా మైనారిటీల కోసం ఖర్చుచేశారని మండిపడ్డారు. గాంధీ కుటుంబానికి ఏళ్ల తరబడి అవకాశాలు ఇచ్చినా.. ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. కాంగ్రెస్ కు అభివృద్ధిపై నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. మీ సంతోషంలో అయినా, బాధలో అయినా వారు మీ దగ్గరకు రారని రాయ్ బరేలీ ర్యాలీలో ప్రసంగించారు అమిత్ షా.

ఇకపోతే, రాయ్ బరేలీ లోక్ సభ స్థానానికి సోనియా రెండు దశాబ్దాలపాటు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున దినేష్ ప్రతాప్ బరిలో ఉండగా.. ఆయనకు మద్దతుగా ప్రచారం చేపట్టారు అమిత్ షా.

‘షెహజాదా’ ఓట్లు అడిగేందుకే రాయ్ బరేలీకి వచ్చారని రాహుల్ ని ఉద్దేశించి అన్నారు అమిత్ షా. చాలా ఏళ్లుగా ఓటేస్తున్నారు.. ఎంపీ ఫండ్ నుంచి ఏమైనా నిధులు వచ్చాయా? అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. మైనారిటీల కోసం సోనియా 70 శాతానికి పైగా నిధులు ఖర్చుచేశారని మండిపడ్డారు.

రాయ్ బరేలీ ఫ్యామిలీ సీటు అని ఇక్కడ చాలా మంది చెప్పారని పేర్కొన్నారు. ఇది నిజమని.. రాయ్ బరేలీ ప్రజలు గాంధీ, నెహ్రూ కుటుంబాలను ఇన్నాళ్లు గెలిపించారని పేర్కొన్నారు. కానీ ఇక్కడి నుంచి ఎన్నికైన తర్వాత సోనియా, ఆమె కుటుంబం ఎన్నిసార్లు వచ్చారని ప్రశ్నించారు. సరే, సోనియా ఆరోగ్యం బాగాలేదని.. అయితే రాహుల్ బాబా లేదా సోదరి ప్రియాంక వచ్చారా? అని అడిగారు.

మరోవైపు, పాక్ పై కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “రాహుల్ బాబా, మీరు అణు బాంబుకు భయపడాలనుకుంటే, భయపడండి, మేం భయపడం.. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశానికి చెందింది. దాన్ని దక్కించుకుంటాం." అని పేర్కొన్నారు.

Advertisement

Next Story