- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US: అమెరికాను కలవరపెడుతున్న జాత్యాహంకార సందేశాలు
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ఎన్నికల్లో (US presidential elections) డొనాల్డ్ ట్రంప్(Donald Trump) గెలిచి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. కాగా.. ప్రభుత్వం మారే సమయంలో అమెరికా వ్యాప్తంగా జాత్యాహంకార సందేశాలు(Racist Texts) అక్కడ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. స్కూల్ విద్యార్థులతో పాటు నల్లజాతీయులనే లక్ష్యంగా చేసుకుని బెదిరింపు ఫోన్ సందేశాలు వస్తున్నాయి. కాలిఫోర్నియా(California), పెన్సిల్వేనియా(Pennsylvania), న్యూజెర్సీ(New Jersey), మిచిగాన్(Michigan), నార్త్ కరోలినా(North Carolina), వర్జీనియా(Virginia), అలబామాతో(Alabama) సహా డజనుకుపైగా రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. సందేశాల్లో వాడిన పదాలు భిన్నంగా ఉన్నా బెదిరింపులు మాత్రం ఒకేలా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. కొందరిని స్వస్థలం చిరునామా చెప్పాలంటూ వేధించగా.. మరికొందరిని రాబోయే అధ్యక్ష పాలన గురించి హెచ్చరించారు. ఈ సందేశాలపై న్యాయ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఎఫ్‌బీఐ(FBI) తెలిపింది. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్, ఫెడరల్, స్టేట్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో కలిసి దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఒహాయో అటార్నీ జనరల్ కార్యాలయం కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. మేరీలాండ్, ఓక్లహామా వంటి 10కి పైగా రాష్ట్రాలతో పాటు డీసీలోనూ ఇలాంటి ఘటనలే జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. దీనిపై తమ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు చేస్తోందని పోలీసులు తెలిపారు.
విద్యార్థులకు సందేశాలు
ఇకపోతే, తన 16 ఏళ్ల కుమార్తె ఫోన్‌కు సందేశం వచ్చినట్టు కాలిఫోర్నియాలోని లోడీకి చెందిన తాషా డన్హామ్ చెప్పారు. ‘‘నా కూతురిని తక్షణం నార్త్ కరోలినాలోని ఒక గార్డెన్ కి రావాలని ఆదేశించారు. ఆరా తీస్తే అక్కడో మ్యూజియం ఉంది’’అని తెలిపారు. పెన్సిల్వేనియాలోని మాంట్‌గోమెరీ కౌంటీలో ఆరుగురు మిడిల్ స్కూల్ విద్యార్థులకు, దక్షిణ కరోలినాలోని క్లెమ్సన్, అలబామా వంటి పలు యూనివర్సిటీ స్టూడెంట్స్ కు కూడా ఇలాంటి మెసేజ్ లే వచ్చాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై నాష్‌విల్లేలోని చరిత్రాత్మక నల్లజాతి విశ్వవిద్యాలయం ఫిస్క్ ఆందోళన వ్యక్తం చేసింది. మిస్సోరీ స్టేట్ వర్సిటీ చాప్టర్‌లో సభ్యులుగా ఉన్న నల్లజాతి విద్యార్థులకు కూడా సందేశాలు వచ్చాయి. వాటిలో ట్రంప్ గెలుపును ప్రస్తావించారు. నల్లజాతి విద్యార్థులను పత్తి ఏరడానికి ఎంపిక చేశారంటూ అందులో పేర్కొన్నారని మిస్సోరి ఎన్‌ఏఏసీపీ అధ్యక్షుడు నిమ్రోద్ చాపెల్ చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.