ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఆర్ మాధవన్

by Mahesh |
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఆర్ మాధవన్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ కు చెందిన విలక్షన నటుడు ఆర్ మాధవన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ) సొసైటీ అధ్యక్షుడిగా మరియు పాలక మండలి చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. కాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులను సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) జారీ చేసింది. మాజీ ప్రెసిడెంట్ డైరెక్టర్ శేఖర్ కపూర్ పదవీకాలం 3 మార్చి, 2023 తో ముగిసింది.

దీంతో "Mr R మాధవన్ FTII సొసైటీ ప్రెసిడెంట్, గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. FTII చైర్‌పర్సన్ నేతృత్వంలోని FTII సొసైటీలో 12 మంది నామినీలు ఉన్నారు. వారిలో ఎనిమిది మంది 'పర్సన్స్ ఆఫ్ ఎమినెన్స్' కేటగిరీ కింద నామినేట్ కాగా, నలుగురు FTII పూర్వ విద్యార్థులు. ఇన్స్టిట్యూట్ చైర్‌పర్సన్‌ను నియమించేటప్పుడు మంత్రిత్వ శాఖ సాధారణంగా సభ్యులను నామినేట్ చేస్తుంది. అయితే అక్టోబర్ 2017లో నటుడు అనుపమ్ ఖేర్‌ను నియమించినప్పుడు ఈ సంప్రదాయం నుండి తప్పుకుంది.

Advertisement

Next Story