Quad Summit : ఈనెల 21న అమెరికాలో క్వాడ్ సదస్సు.. వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యం

by Hajipasha |
Quad Summit : ఈనెల 21న అమెరికాలో క్వాడ్ సదస్సు.. వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా దేశాలతో కూడిన క్వాడ్ కూటమి సదస్సు ఈనెల 21న అమెరికాలోని దిలావర్ రాష్ట్రం విల్మింగ్టన్ పట్టణంలో జరగనుంది. ఇది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సొంత పట్టణం కావడం విశేషం. ఈ ఏడాదితో క్వాడ్ కూటమి ఏర్పాటై సరిగ్గా 20 ఏళ్లు గడిచాయి. క్వాడ్ సదస్సుకు హాజరైన తర్వాతి రోజు, దాని మరుసటిరోజు (సెప్టెంబరు 22, 23 తేదీల్లో) న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొంటారు.

ఇక సెప్టెంబరు 22న న్యూయార్క్ రాష్ట్రంలోని నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియంలో ‘‘మోడీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’’ పేరుతో నిర్వహించే సదస్సులో మోడీ ప్రసంగిస్తారు. సెప్టెంబరు 28న జరగనున్న ఐరాస సర్వసభ్య సమావేశం అత్యున్నత స్థాయి భేటీలో భారత ప్రధాని మోడీకి బదులుగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రసంగించనున్నారు. కాగా, 2025 సంవత్సరంలో క్వాడ్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

Advertisement

Next Story

Most Viewed