Prime Minister:‘మీ ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను పెట్టుకోండి’ ..ప్ర‌ధాని మోడీ పిలుపు!

by Jakkula Mamatha |   ( Updated:2024-08-13 11:26:49.0  )
Prime Minister:‘మీ ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను పెట్టుకోండి’ ..ప్ర‌ధాని మోడీ పిలుపు!
X

దిశ,వెబ్‌డెస్క్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి ఇంటి పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చింది. ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్స‌వం స‌మీపిస్తున్నందున హ‌ర్‌ఘ‌ర్‌తిరంగాను గుర్తిండిపోయే ఈవెంట్‌గా మార్చుకుందామంటూ ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ దేశ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. నేటి నుంచి ఆగస్టు 15 వరకు అందరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్స్‌ను మార్చాలని కోరారు. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ఖాతాల డీపీలను త్రివర్ణ పతాకంతో మార్పు చేయాలని పిలుపునిచ్చారు. ‘నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివ‌ర్ణ ప‌తాకంగా మార్చుకున్నాను. మీరు కూడా అలాగే చేయండి. జాతీయ జెండాల‌తో ఉన్న మీ సెల్ఫీల‌ను https://harghartiranga.comలో షేర్ చేయండి’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story