- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రి కాబోతున్న ముఖ్యమంత్రి.. రిపబ్లిక్ డే వేడుకల్లో శుభవార్త ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుభవార్త చెప్పారు. తాను తండ్రి కాబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ 7వ నెల గర్భవతి అని తెలిపారు. మార్చి నెలలో నా ఇంటికి కూడా సంతోషం రాబోతోందని ప్రకటించారు. పుట్టబోయేది మగపిల్లా, ఆడపిల్లా అనేది ఇప్పటికీ మాకు తెలియదని.. ఎవరొచ్చినా సంతోషమే అని తెలిపారు.
పిల్లల లింగ నిర్ధారణకు దూరంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పుట్టిన బిడ్డల్లో అబ్బాయి – అమ్మాయి ఇద్దరినీ సరి సమానంగా ప్రేమించాలని అన్నారు. కాగా, డాక్టర్ గురుప్రీత్‌ను జూలై 2022లో సీఎం భగవంత్ మాన్ వివాహం చేసుకున్నారు. ఆమె మాన్‌కు రెండవ భార్య. అంతకుముందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లూథియానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు.