నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధించిన పూణె కోర్టు

by Disha Web Desk 17 |
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధించిన పూణె కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కార్యకర్త నరేంద్ర దభోల్కర్ హత్య కేసుపై శుక్రవారం విచారణ చేపట్టిన పూణేలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధించగా, మరో ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేసింది. 2013 ఆగస్టు 20న కాలినడకకు వెళ్లిన నరేంద్రపై బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ కేసుపై 11 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది.

ఈ హత్య కేసులో వీరేంద్రసిన్హ్ తావ్డే, సంజీవ్ పునలేకర్, విక్రమ్ భావేలను నిర్దోషులుగా పేర్కొనగా, సచిన్ అందే, శరద్ కలస్కర్‌లకు జీవిత ఖైదు విధించింది. నరేంద్ర దభోల్కర్‌ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటారు. మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితికి వ్యవస్థాపకుడు ఆయన. తొలుత పూణె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే, బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు 2014లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తును చేపట్టింది.

మొదట జూన్ 2016లో, వారు హిందూ మితవాద సంస్థ సనాతన్ సంస్థతో సంబంధం ఉన్న ENT సర్జన్ డాక్టర్ వీరేంద్రసిన్హ్ తవాడేను పట్టుకున్నారు. తవాడే హత్యకు ప్రధాన సూత్రధారులలో ఒకడు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా దాభోల్కర్ చేసిన పోరాటాన్ని నిందితులు వ్యతిరేకించే వారని అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా సీబీఐ అనుబంధ చార్జ్ షీట్‌లో దభోల్కర్‌ను కాల్చిచంపింది అందూరే, కలాస్కర్ అని పేర్కొంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed