Cyclone Fengal: ఫెయింజల్ తుఫానుతో అస్తవ్యస్తంగా మారిన పుదుచ్చేరి

by Shamantha N |
Cyclone Fengal: ఫెయింజల్ తుఫానుతో అస్తవ్యస్తంగా మారిన పుదుచ్చేరి
X

దిశ, నేషనల్ బ్యూరో : ఫెయింజల్ తుఫానుతో(Cyclone Fengal) పుదుచ్చేరి(Puducherry) అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలతో పeలుచోట్ల ఇళ్లలోకి వరదలు వచ్చాయి. ఫెయింజల్ తుఫాను పుదుచ్చేరిని సమీపించిన తర్వాత పుదుచ్చేరిలో 44 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా.. గత 30 ఏళ్లలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే. ఇక, ఫెయింజల్ తుఫాను వల్ల ముగ్గురు చనిపోయారు. భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమై పుదుచ్చేరి రోడ్లన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి. మామల్లపురం పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నప్పటికీ గాలి వేగం ఎక్కువగా ఉండడంతో విద్యుత్ సరఫరా కాలేదు. పుదుచ్చేరిలో సహాయక చర్యల కోసం ఆర్మీని పిలిచినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సహాయక చర్యలు కష్టతరంగా మారాయి.

పుదుచ్చేరిలో వర్షాలు

ఇక, ఫెయింజల్ తుఫాను తీరం దాటినప్పటికీ పుదుచ్చేరి ప్రాంతంలో బలమైన గాలులు వీస్తున్నాయి. పుదుచ్చేరి, తమిళనాడులో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడులోని 6 జిల్లాలకు, పుదుచ్చేరికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. తుఫాను కారణంగా చెన్నై ఎయిర్ పోర్టుని 16 గంటలపాటు మూసివేశారు. చెన్నై విమానాశ్రయం ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటకు తిరిగి తెరిచారు. అయినప్పటికీ పలు విమానాలు రద్దు కాగా.. మరికొన్ని విమానాలు ఆలస్యమయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed