- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఢిల్లీ మార్చ్’ రైతన్నల పాస్‌పోర్టులు రద్దు..? చట్టాలేం చెబుతున్నాయ్.. ?
దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవల ఢిల్లీ మార్చ్ నిరసనల్లో పాల్గొన్న రైతన్నలకు హర్యానాలోని అంబాలా జిల్లా పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆందోళన కార్యక్రమాల సందర్భంగా శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో బారికేడ్లను బద్దలు కొట్టి హింసకు పాల్పడిన వారి పాస్‌పోర్ట్‌లు, వీసాలను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. బారికేడ్లను బద్దలు కొట్టడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడిన వారి సీసీటీవీ, డ్రోన్ కెమెరాల ఫుటేజీలను తాము సేకరించామని.. వారందరిపై యాక్షన్ తప్పదని స్పష్టం చేశారు. వాస్తవానికి ‘పాస్‌పోర్ట్ చట్టం-1967’ నిర్దేశించిన విధి విధానాలను అనుసరించకుండా పాస్‌పోర్ట్‌లు లేదా వీసాలను రద్దు చేయడం కుదరదు. కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి లేకుండా ఏకపక్షంగా పాస్‌పోర్ట్‌లను రద్దు చేసే అధికారాలు పోలీసులకు ఉండవు.
పాస్‌పోర్ట్‌లు ఎప్పుడు రద్దు చేయొచ్చు ?
* పాస్‌పోర్ట్ చట్టం -1967లోని పాస్‌పోర్ట్ అథారిటీ సెక్షన్ 10ఏ, 10బీ కింద పాస్‌పోర్ట్ లేదా వీసాను స్వాధీనం చేసుకోవచ్చు లేదా రద్దు చేయొచ్చు. ఈ సెక్షన్ల అమలులో భాగంగా భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలను కాపాడేందుకు.. ఏదైనా విదేశంతో భారతదేశ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఎంపిక చేసిన వారి పాస్‌పోర్ట్‌లను సీజ్ చేయొచ్చు.
* జాతీయ భద్రత ఆందోళనలు
ఒక వ్యక్తి కార్యకలాపాలు జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఉంటే.. అధికారులు అతడి పాస్‌పోర్ట్‌ను రద్దు చేయొచ్చు. విధ్వంసక కార్యకలాపాలలో పాల్గొనే వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. శాంతియుత నిరసనలకు ఇది అప్లై కాదు.
* క్రిమినల్ నేరాలు
మోసం, తీవ్రవాదం, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తారు. నిరసన ప్రదేశాల్లో బారికేడ్లను బద్దలు కొట్టడం, చట్టవిరుద్ధమైన సమావేశాలు, పబ్లిక్ ఆర్డర్‌ను ఉల్లంఘించడం వంటివి చేసే వారిపై పాస్‌పోర్టు సంబంధిత చర్యలు తీసుకుంటారు.