- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రిని ధ్వంసం చేసిన నిరసన కారులు..?
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో ఆర్‌జి కర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటర యావత్ దేశాన్ని కుదిపెసింది. కాగా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడంతో దేశంలోని అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు ఆటంకం నెలకొంది. దీంతో ఈ సంఘటనపై బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షత్తు మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన చోటు చేసుకొవడం.. ఆ ప్రభుత్వ వైపల్యాన్ని చూపిస్తుందని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. హత్యకు గురైన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌కు న్యాయం చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్, దేశవ్యాప్తంగా బుధవారం రాత్రి 'రీక్లైమ్ ది నైట్' నిరసన ప్రారంభమైంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నిరసన ఊపందుకుంది, మరణించిన ట్రైనీ డాక్టర్‌కు న్యాయం చేయాలని పలువురు మహిళలు వీధుల్లోకి వచ్చారు, ప్లకార్డులు పట్టుకుని బాధితురాలు కుటుంభానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే బుధవారం రాత్రి 'రీక్లైమ్ ది నైట్' నిరసన సందర్భంగా ఒక్కసారిగా ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోకి నిరసనకారులు ప్రవేశించారు. పెద్దమొత్తంలో అక్కడకు చేరుకున్న ఒ గుంపు ఆసుపత్రి ఆస్తులను ధ్వంసం చేశారు. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డును పూర్తిగా ధ్వంసం చేశారు. నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే స్థానిక నేతలు, జూనియర్ డాక్టర్లు రాత్రి జరిగిన విద్వాంసానికి తమకు ఎటువంటి సంబంధం లేదని.. ఇది ముమ్మాటి టీఎంసీ నేతల పనేనని.. తమ నిరసనను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.