Parliament monsoon session: నీట్ పై ప్రతిపక్షాల రగడ

by Shamantha N |
Parliament monsoon session: నీట్ పై ప్రతిపక్షాల రగడ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్డీఏ కూటమి మూడోసారి కొలువుదీరాక.. తొలిసారి బడ్జెట్ సమర్పించేందుకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా.. నీట్ రగడతో పార్లమెంటు దద్దరిల్లింది. కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి. ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో పార్లమెంటులో గందరగోళంగా మారింది. మరోవైపు.. ఈ అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు చేశారు. భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "మన పరీక్షా విధానంలో చాలా తీవ్రమైన సమస్య ఉందని దేశం మొత్తానికి స్పష్టంగా అర్థమైంది. పేపర్ లీకేజీలపై కేంద్రమంత్రి అందర్నీ నిందించారని..తనని తప్ప. కానీ, ఇక్కడ ఏమి జరుగుతుందో కూడా అర్థం చేసుకోవట్లేదని అనుకోను" అని అన్నారు.ఈ దేశంలోని లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దేశ విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో ఉంది. ధనవంతులు పరీక్షా విధానాన్ని కొనవచ్చే భావనలో ఉన్నారని మండిపడ్డారు. ఈ సమస్యను వ్యవస్థాగత స్థాయిలో పరిష్కరించడానికి ప్రభుత్వం ఏమి చేస్తోంది.

ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే:

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ.. ‘‘గత ఏడేళ్ల కాలంలో పేపర్‌ లీక్‌ జరిగిన దాఖలాలు లేవు. ఎన్టీఏ ఇప్పటివరకు 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం నీట్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది’’ అని అన్నారు. మరోవైపు, పేపర్ లీకేజీలపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. ప్రభుత్వం పేపర్‌లీక్‌ల విషయంలో రికార్డు సృష్టిస్తుందని ఎద్దేవా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ విద్యాశాఖ మంత్రిగా ఉన్నంతకాలం విద్యార్థులకు న్యాయం దక్కదన్నారు.

Advertisement

Next Story