Priyanka: ప్రజాస్వామ్యంపై బీజేపీ చేస్తున్న దాడిని ఎదుర్కోవాలి.. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ

by vinod kumar |
Priyanka: ప్రజాస్వామ్యంపై బీజేపీ చేస్తున్న దాడిని ఎదుర్కోవాలి.. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజాస్వామ్యంపై బీజేపీ చేస్తున్న దాడిని ఎదుర్కోవాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పిలుపునిచ్చారు. కేరళలోని నిలంబూర్‌లో సోమవారం జరిగిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) నాయకుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. రాజ్యాంగ విలువలు, డెమొక్రసీ రక్షణ కోసం యూడీఎఫ్ దృఢంగా నిలబడాలని కోరారు. తమ పోరాటం స్థానిక సమస్యలకే పరిమితం కాకూడదని, ప్రజల హక్కులను, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించడానికి కూడా అని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పని చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. బీజేపీ రాజ్యాంగబద్ధ సంస్థలను ఒక క్రమపద్ధతిలో నిర్వీర్యం చేస్తూ.. ప్రజల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. అలాగే ఇటీవల వన్యప్రాణుల దాడుల్లో మరణించిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలను ప్రియాంక కలిసి వారిని పరామర్శించారు. వన్యప్రాణుల సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మరిన్ని నిధులు విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు.

Next Story