- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Priyanka: వయనాడ్ బాధితులను బీజేపీ మోసం చేసింది.. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్(Wayanad)లో కొండ చరియలు విరిగిపడి బాధితులుగా మారిన ప్రజలను బీజేపీ మోసం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) ఆరోపించారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆమె మలప్పురం(Malappuram), కోజికోడ్(kojikode) జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రచార సభల్లో ప్రియాంక ప్రసంగించారు. వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడినప్పుడు ఆ ప్రాంతంలో పర్యటించిన ప్రధాని మోడీ (Pm modi) వారికి సాయం అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ప్రకటించలేదని ఫైర్ అయ్యారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అంతేగాక ప్రజాస్వామ్యాన్ని (Democracy) ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో ద్వేషం, విభజనను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. మోడీ అనుసరిస్తున్న విధానాలు ఆయనకు చెందిన కొంత మంది మిత్రులకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని తెలిపారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడతానని, వయనాడ్ ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. అనంతరం మలప్పురంలోని సీతీ హాజీ మెమోరియల్ ఫుట్‌బాల్ స్టేడియం(Foot ball stadium)ను ప్రియాంక సందర్శించారు. అక్కడ ఉన్న ఫుట్‌బాల్ ప్లేయర్లతో కాసేపు మాట్లాడారు.