- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నరేంద్ర మోడీ ‘ది బాస్’.. ఆస్ట్రేలియా ప్రధాని ప్రశంసలు
దిశ, డైనమిక్ బ్యూరో: భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య అనుబంధం చరిత్రాత్మకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇరు దేశాల మధ్య బంధం క్రికెట్ కంటే మించిన అనుబంధం ఉందన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లిన మోడీ.. సిడ్నీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయులను ఆస్ట్రేలియా వాసులు అక్కున చేర్చుకున్నారని ఇరు దేశాలకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. భారత్, ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తుంటాయని అవి కామన్వెల్త్, క్రికెట్, కర్రీ అని ఆ తర్వాత 3 డీలు (డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ)లు ప్రధానంగా ఉన్నాయన్నారు. ఇరు దేశాలను కలిపి ఉంచే మరో బంధం యోగా అన్నారు.
భారతీయ భాషలన్నీ ఆస్ట్రేలియాలో ప్రముఖంగా వినిపిస్తాయని భారతీయ ప్రముఖ వంటకాలన్నీ ఆస్ట్రేలియాలో లభిస్తాయన్నారు. సిడ్నీలో లక్నో పోరుతో ఓ ప్రాంతమే ఉందని, సిడ్నీ ఒపేరా హౌస్ పై భారత జెండా కనిపించడం ఎంతో ఆనందానిచ్చిందన్నారు. ఈ సందర్భంగా భారత్ గొప్పదనాన్ని ఆస్ట్రేలియాలోని ప్రవాసులకు ప్రధాని వివరించారు. నైపుణ్యానికి భారతదేశంలో కొదువ లేదని వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని చెప్పారు. నేను మళ్లీ ఆస్ట్రేలియాకు వస్తానని 2014లోనే మీకు వాగ్ధానం ఇచ్చానని మళ్లీ అస్ట్రేలియాకు వచ్చి నా వాగ్దానం నెరవేర్చుకున్నానన్నారు.
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేయడమే తన కల అని కరోనా సమయంలో ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ భారత దేశంలో జరిగిందన్నారు.దేశం అనే అంశాల్లో నెంబర్ వన్ గా మారిందని గుర్తు చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతెం చేశామని, ఒక్క క్లిక్ తో డీబీటీ సాధ్యమైందన్నారు.కరోనా సమయంలో డబ్బు పంపించేందుకు చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. భారత్ లో మాత్రం ఎటువంటి సమస్యలు రాలేదన్నారు. పేమెంట్స్ లో యూపీఐ కొత్త శకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రస్తుతం భారత్ లో పారెక్స్ రిజర్వులు భారీగా ఉన్నాయన్నారు. ప్రంచ మేలు కోసం భారత్ కృషి చేస్తుందని చెప్పారు. అంతకు ముందు ఈ కార్యక్రమంలో పరిచయ వ్యాఖ్యలు మాట్లాడిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నరేంద్ర మోడీని ది బాస్ అని సంబోధించారు.