MODI: చెవులు రిక్కించి వినండి.. కాంగ్రెస్‌పై రెచ్చిపోయిన ప్రధాని మోడీ

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-23 15:36:22.0  )
MODI: చెవులు రిక్కించి వినండి.. కాంగ్రెస్‌పై రెచ్చిపోయిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల(Maharashtra election results)పై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఫలితాల అనంతరం ఢిల్లీలోని బీజేపీ(BJP) కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశంలో ఒకే రాజ్యాంగం ఉందని.. అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలారా చెవులు రిక్కించి వినండి.. ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురాలేదని అన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించాలని చూసిందని ఆరోపించారు. రెండు రాజ్యాంగాలు ఉండాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలను మహారాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని కొనియాడారు. పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని అన్నారు.

అందుకే జనం కాంగ్రెస్‌కు ఓటు వేయడం లేదని తెలిపారు. రాజ్యాంగాన్ని చేత పట్టుకొని చెప్పాల్సిన అబద్ధాలన్నీ చెప్పారని.. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో ఏం చేసిందో ప్రజలకు తెలుసని అన్నారు. అన్ని రాష్ట్రాలను మహారాష్ట్ర ప్రజలు గమనించారు.. అందుకే కాంగ్రెస్‌కు సరైన విధంగా బుద్ధి చెప్పారని అన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్‌ ఎంతకైనా తెగిస్తుందని.. కుల రాజకీయాలు చేసి దండుకోవాలని చూసిందని మండిపడ్డారు. మాతృ భాష అంటే అమ్మతో సమానం అని చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ మరాఠీ భాష అభివృద్ధి కోసం కృషి చేయలేదని గుర్తుచేశారు. మహారాష్ట్ర దేశ అభివృద్ధికి ఇంజిన్ లాంటిదని అన్నారు. ఇప్పుడు ఇక్కడ సత్యం, ధర్మం, న్యాయం గెలిచాయని తెలిపారు. ఎన్‌డీఏ అంటే గుడ్ గవర్నెన్స్ అని అభివర్ణించారు.

Advertisement

Next Story

Most Viewed