దానికి కూడా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోంది!.. ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు

by Ramesh Goud |   ( Updated:2024-05-26 11:29:16.0  )
దానికి కూడా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోంది!.. ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో కూడా బ్రహ్మోస్ క్షిపణి తయారయ్యే రోజు దగ్గర్లోనే ఉందని, కానీ భారతీయులు ఒకటి కోరుకుంటే ఈ ఇండియా కూటమి వ్యక్తులు ఇంకోటి కోరుకుంటున్నారని ప్రధాని మోడీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని మీర్జాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఇండియా కూటమిపై విమర్శలు చేశారు. జూన్ 4, 2024 తేదీ భారత దేశ భవిష్యత్తును నిర్ణయించబోతోంది అని, జూన్ 4న దేశం కొత్త విమానానికి రెక్కలు విప్పనుందని అన్నారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించేందుకు జూన్ 4 నుంచి కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుందని తెలిపారు.

అలాగే ఉత్తరప్రదేశ్‌లో కూడా బ్రహ్మోస్ క్షిపణి తయారయ్యే రోజు ఎంతో దూరంలో లేదని, బ్రహ్మోస్ క్షిపణి యొక్క భయం చాలా వరకు వ్యాపిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో బ్రహ్మోస్ క్షిపణికి డిమాండ్ ఉంది, కానీ కాంగ్రెస్ దాని మార్గంలో కూడా అడ్డంకులు సృష్టించిందని ఆరోపణలు చేశారు. భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన చెందాలని, ఆయుధాలను ఎగుమతి చేసే సామర్థ్యాన్ని భారతదేశంలో సృష్టించాలని భారతీయులు కోరుకుంటున్నారు. కానీ ఈ ఇండియా కూటమి కుర్రాళ్ళు విదేశీ ఆయుధ ఒప్పందాలు కొనసాగించాలని, వారి బ్రోకరేజ్ వస్తూ ఉండాలని కోరుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మోడీ విమర్శలు చేశారు.

Read More..

మరో మూడేళ్లలో మావోయిస్టు రహిత భారత్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Advertisement

Next Story