- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల సంకెళ్లు తెంచేందుకు ప్రభుత్వం కృషి: ప్రధాని మోడీ
దిశ, డైనమిక్ బ్యూరో: మహిళా రిజర్వేషన్ బిల్లు మెజారిటీ ప్రభుత్వంతోనే సాధ్యపడిందని.. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే మెజారిటీ ప్రభుత్వం అవసరమని ఇది రుజువు చేస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మహిళల సంకెళ్లను తెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన వారే మహిళా శక్తిని తెలుసుకుని ప్రస్తుతం మద్దుతు తెలిపారని చెప్పారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లుకు ఏర్పడిన అడ్డంకులు, సవాళ్లను అన్నింటిని అధిగమించామని పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఈ బిల్లుకు భారీ మద్దతు లభించడం ఓ రికార్డు అని అన్నారు. బిల్లు ఆమోద ముద్రకు సహకరించిన రాజకీయ పార్టీలు, ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి బీజేపీ మహిళా నేతలు పూలమాలతో సత్కరించారు.