- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెట్రో తరహాలో ర్యాపిడ్ ఎక్స్ సర్వీసులు.. రేపే ప్రారంభం
దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ రైల్వేలో కొత్త శకం ప్రారంభం కానుంది. ఇటీవల వందే భారత్ రైళ్లకు మించిన వేగంతో ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు రానున్నాయి. చూడడానికి మెట్రో రైళ్లలాగే ఉన్నా.. సీటింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ర్యాపిడ్ రైళ్లలో అన్ని హంగులతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. మెట్రోలా ఉండే ఈ ర్యాపిడ్ రైళ్ల 8 కారిడార్లను నిర్మించనున్నారు. మొదటి దశలో ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో ఘజియాబాద్-మీరట్, ఢిల్లీ-గుర్గావ్-నిమ్రానా-అల్వార్, ఢిల్లీ- పానిపట్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రైళ్లు ఢిల్లీ నుంచి మీరట్ రెండు గంటల సమయం తసుకుంటే.. ర్యాపిడ్ రైళ్లు కేవలం గంటలోనే వెలుతుంది. ఢిల్లీ- మీరట్ మార్గంలో రేపు దేశ ప్రధాని మోడీ తొలి ర్యాపిడ్ ఎక్స్ రైలు సర్వీసును ప్రారంభించనున్నారు.
ఈ నెల 21 నుంచి ప్రయాణికులకు ‘ర్యాపిడ్ ఎక్స్’ రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ఆర్ఆర్‌టీఎస్ కారిడార్ పరిధిలో ఐదు స్టేషన్ల మీదుగా ‘ర్యాపిడ్ ఎక్స్’ రైలు సేవలు ప్రారంభం అవుతాయి. ఆరు కోచ్‌లు ఉన్న ఈ రైలులో 1700 మంది ప్రయాణం చేయొచ్చు. స్టాండర్డ్ కోచ్ టికెట్ ధర కనీసం రూ.20, గరిష్టం రూ.50గా నిర్ణయించారు. ప్రీమియం కోచ్ లో కనీసం రూ.40, గరిష్టం రూ.100 గా నిర్ణయించారు. కాగా, భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ రైలు అని ఎంపీ అర్వింద్ ధర్మపురి ట్వీట్ చేశారు.