పడవ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

by GSrikanth |
పడవ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని వడోదరలో జరిగిన పడవ ప్రమాదంపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ట్వీట్ పెట్టారు. అనూహ్య ప్రమాదంలో దిగ్భ్రాంతికి గురయ్యాయనని తెలిపారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. బాధితులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, వ‌డోద‌ర‌లోని హ‌ర్ని స‌ర‌స్సులో ప‌డ‌వ బోల్తా ప‌డి ఇప్పటి వ‌ర‌కు 14 మంది చిన్నారులు మ‌ర‌ణించారు. ప్రమాద స‌మ‌యంలో ప‌డ‌వ‌లో 27 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story