Nobel peace Prize : నోబెల్ శాంతి బహుమతికి మోడీ ఎలిజిబుల్ : మార్క్ మోబియస్

by Sathputhe Rajesh |
Nobel peace Prize : నోబెల్ శాంతి బహుమతికి మోడీ ఎలిజిబుల్ : మార్క్ మోబియస్
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధాని మోడీ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని ప్రముఖ జర్మన్ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ అన్నారు. ఐఏఎన్‌ఎస్‌లో మంగళవారం జరిగిన చర్చలో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోడీని గొప్ప లీడర్‌ అని, మంచి మనిషి అని ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మోడీ శాంతి స్థాపనలో మరింత ముందుకు సాగాలని కాంక్షించారు. ప్రపంచదేశాల్లో సఖ్యతను పెంపొందించే అంశంలో మోడీ అన్ని విధాలా అర్హుడని కొనియాడారు. నోబెల్ శాంతి బహుమతికి మోడీ అన్ని విధాలా అర్హుడన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తటస్థంగా కనిపించినా తన వైఖరిని స్పష్టం చేసిందని కొనియాడాడు. చర్చలు ద్వారా శాంతియుత పరిష్కారం లభిస్తుందని ఇండియా స్పష్టంగా వెల్లడించిందని గుర్తు చేశారు. ఉక్రెయిన్‌లో శాంతి కోసం జూన్ 2024లో స్విట్జార్లాండ్‌ వేదికగా నిర్వహించిన సదస్సులో భారత్ పాల్గొందని తెలిపారు. మీకు, మోడీకి ఉన్న సారూప్యత ఏంటని ప్రశ్నించగా.. తామిద్దరం ముందుకు సాగడంపైనే దృష్టి సారిస్తామని వెనక్కి తిరిగి చూసుకోమని స్పష్టం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed