బ్రేకింగ్: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ప్రధాని మోడీ ఫోన్

by Satheesh |   ( Updated:2023-06-04 08:19:33.0  )
బ్రేకింగ్: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ప్రధాని మోడీ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఒడిషాలో ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్ రైల్వే ప్రమాద ఘటనలో కొనసాగుతోన్న సహయక చర్యలపై ఆరా తీశారు. ప్రమాదానికి గురైన ట్రాక్ మరమ్మత్తులు, ట్రాక్ పునరుద్ధరణ పనుల గురించి మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను అడిగి తెలుసుకున్నారు. ట్రాక్‌ మరమ్మత్తు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని మంత్రికి ప్రధాని మోడీ సూచించారు. ఇక, ఒడిషా రైలు ప్రమాద ఘటన స్థలాన్ని నిన్న (శనివారం) ప్రధాని మోడీ స్వయంగా వెళ్లి పరిశీలించారు. అనంతరం ఈ ఘటనలో గాయపడిన వారిని ఒడిషాలోని కటక్ ఆసుపత్రికి వెళ్లి ఆయన పరామర్శించారు.

ఇదిలా ఉండగా.. ఒడిషాలో ప్రమాదం జరిగిన బహానాగ స్టేషన్ వద్ద రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ప్రమాదంలో గూడ్స్ రైలు బోగీలపైకి ఎక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇంజిన్‌ను తొలగించారు. అతి కష్టం మీద సహయక సిబ్బంది కోరమాండల్ ఇంజిన్‌ను గూడ్స్ బోగీల మీదనుండి కిందకు తీశారు. ప్రమాదం దాటికి తెగిపోయిన రైల్వే పవర్ లైన్‌ను పునరుద్ధరించేందుకు సహయక సిబ్బంది, అధికారులు, రైల్వే ఇంజనీర్లు నిరంతరాయంగా పనిచేస్తున్నారు.

ఇక, శుక్రవారం రాత్రి హౌరా నుండి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఒడిషాలో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 290 మంది మరణించగా.. మరో 900 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతోన్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Read More: కరోనా సమయంలో ‘ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్’గా ఇండియా: మంత్రి కిషన్ రెడ్డి

Advertisement

Next Story

Most Viewed