కర్ణాటక: రోడ్ షోలతో దుమ్ములేపుతున్న మోడీ, అమిత్ షా

by GSrikanth |
కర్ణాటక: రోడ్ షోలతో దుమ్ములేపుతున్న మోడీ, అమిత్ షా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి కర్ణాటకలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మేన 10న ఎన్నికలు జరుగుతుండటంతో ప్రచారంలో వేగం పెంచారు. ప్రధాని మోదీ అయితే మెగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. కిలో మీటర్ల మేర రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలకు అభివాదం తెలుపుతున్నారు. అటు ప్రజలు సైతం ప్రధాని మోదీ అంతే ఘనంగా స్వాగతిస్తున్నారు.

ప్రధాని రోడ్ షో నిర్వహించినంత సేపు పూలు చెల్లుతూ జై బీజేపీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రధాని మోదీ తాజాగా బెంగళూరులో రోడ్ షో నిర్వహిస్తుండగా హోంమంత్రి అమిత్ షా సౌత్ బెల్గాంలో రోడ్ షో చేస్తున్నారు. బీజేపీకి ప్రజలు ఓట్లు వేసేలా హామీలిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ పర్యటనలు కొనసాగిస్తున్నారు. దీంతో స్తానిక బీజేపీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్నికల్లో మరోసారి గెలుపు బావుట ఎగువేస్తామని చెబుతున్నారు. ప్రధాని మోదీ పాలన, బీజేపీ హామీలే తమకు విజయాన్ని అందిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story