- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
President: ఏఐతో భవిష్యత్‌లో కీలక మార్పులు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (Machine learning) రంగాల్లో సుధూర పురోగతిని ఆశిస్తున్నామని, దీని వల్ల భవిష్యత్‌లో కీలక మార్పులు ఉంటాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadhi murmur) అన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Bit) ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో ఆమె ప్రసంగించారు. ఉన్నత విద్యలో ఏఐ అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నొక్కి చెప్పారు. సంబంధిత కోర్సులను ప్రారంభించడంలో బిట్ ముందుందని కొనియాడారు. ప్రస్తుతం సాంకేతిక రంగంలో సృష్టిస్తున్న అవకాశాలు అణగారిన వర్గాలకూ అందుబాటులో ఉండాలని తెలిపారు. టెక్నాలజీ మార్పుల వల్ల అందరికీ ప్రయోజనం చేకూర్చాలని అభిప్రాయపడ్డారు. అయితే సాంప్రదాయ సమాజాల జ్ఞాన స్థావరాన్ని విస్మరించొద్దని ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులను హెచ్చరించారు.
సమాచార సాంకేతిక రంగంలో కొత్త పురోగతులు మన జీవన విధానాన్ని మార్చాయని, నిన్నటి వరకు ఊహించలేనిది నేడు వాస్తవమైందని తెలిపారు. రాబోయే సంవత్సరాలు మరింత నాటకీయంగా ఉండబోతున్నాయని అభిప్రాయపడ్డారు. మన చుట్టూ ఉన్న సమస్యలకు తరచుగా పెద్ద సాంకేతిక జోక్యం అవసరం లేదన్నారు. చిన్న తరహా, సాంప్రదాయ పరిష్కారాల ప్రాముఖ్యతను యువత మర్చిపోవద్దని సూచించారు. 70 సంవత్సరాల విద్యా నైపుణ్యం, పరిశోధన, సాంకేతికతలో ఆవిష్కరణలను పూర్తి చేసిన బిట్ వారసత్వం పట్ల తాను గర్వపడుతున్నానన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఈ సందర్భంగా ఏఐ ఆధారిత రోబోలు, దాని ఆధారంగా నడిచే కార్లు వంటి సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణ వ్యవస్థాపకతను సూచించే ప్రదర్శనను ముర్ము ప్రారంభించారు.