- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ భారత బృందంతో సమావేశమైన రాష్ట్రపతి
by S Gopi |
X
దిశ, నేషనల్ బ్యూరో: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్‌లో పారిస్ ఒలంపిక్స్‌లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో వారిలో సమావేశం నిర్వహించారు. 'అద్భుతమైన కృషి, ప్రదర్శన ఇచ్చినందుకు రాష్ట్రపతి ఒలంపిక్స్ బృందాన్ని అభినందించారు. వారంతా దేశంలోని యువత, యువ ఆటగాళ్లకు స్పూర్తిదాయకమని ' రాష్ట్రపతి భవన్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రి మన్‌సుఖ్ మాండవ్య, భారత ఒలంపిక్స్ సంఘం(ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష పాల్గొన్నారు. ఐదు కాంస్యం, ఒక రజతంతో పారిస్ ఒలంపిక్స్‌లో భారత్ తన పర్యటనను ముగించింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(సీఏఎస్) రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు రజత పతకం ఇచ్చేందుకు అనుకూలంగా తీర్పు ఇచ్చి ఉంటే పతకాల సంఖ్య ఏడుకు పెరిగేది.
Advertisement
Next Story