Prashanth kishore: అట్టడుగు ప్రజలకు చేరువవుతా..రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

by vinod kumar |
Prashanth kishore: అట్టడుగు ప్రజలకు చేరువవుతా..రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
X

దిశ, నేషనల్ బ్యూరో: అట్టడుగు స్థాయి ప్రజలకు చేరువవుతానని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు. జన్ సురాజ్ రాజకీయ పార్టీగా మారినప్పుడు అందులో ఎలాంటి పదవిని కోరుకోనని స్పష్టం చేశారు. ‘బిహార్‌లోని వేలాది గ్రామాలు, చిన్న పట్టణాల గుండా రెండేళ్లకు పైగా పాదయాత్ర చేశా. ఈ క్రమంలోనే అనేక సమస్యలు వెలుగు చూశాయి. దశాబ్దాల దుస్థితిని అంతం చేసేందుకు, బిహార్ యువతకు మంచి భవిష్యత్తును అందించే మెరుగైన ప్రత్యామ్నాయాన్ని అందించడానికి పార్టీ ఏర్పాటు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించాం’ అని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘వాగ్దానం చేసినట్లుగా నేను పార్టీలో ఏ పదవిని కోరుకోను. రాబోయే అనేక నెలల పాటు అట్టడుగు ప్రజలకు చేరువవుతా’ అని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి రోజైన అక్టోబర్‌ 2న తమ ప్రచారం రాజకీయ పార్టీగా అవతరించనుందని వెల్లడించారు. లక్షలాది మందితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. త్వరలోనే పార్టీ రాజ్యాంగాన్ని రూపొందిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story