సోనియా గాంధీ కుటుంబంపై ప్రణబ్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:6 Dec 2023 2:52 PM  )
సోనియా గాంధీ కుటుంబంపై ప్రణబ్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా, రాహుల్ గాంధీలపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాసుకున్న డైరీలో గాంధీ కుటుంబపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను దేశ ప్రధాని కాకుండా సోనియా అడ్డుకున్నదని ప్రణబ్ పేర్కొన్నారు. గాంధీ-నెహ్రూ కుటుంబాల అహంకారమంతా రాహుల్ గాంధీలో ఉందన్నారు. కానీ, గాంధీ-నెహ్రూల చతురత మాత్రం రాహుల్‌కు అబ్బలేదు. మర్యాదగా ప్రవర్తిస్తారు. అనేక ప్రశ్నలు సంధిస్తారు. కానీ, రాజకీయాల్లో ఆయన అనుభవం సాధించలేదు.

2013 జులైలో రాహుల్‌ ఓ సారి మా ఇంటికి వచ్చారు. పార్టీ పునరుద్ధరణకు సంబంధించి తన ప్రణాళికలను చెప్పారు. ఆయన సవాళ్లను ఎదుర్కోగలరని అనిపించింది. ముందు కేబినెట్‌లో చేరి పాలనాపరమైన అంశాల్లో అనుభవం గడించాలని చెప్పాను. కానీ నా సలహాను రాహుల్ వినిపించుకోలేదు అని ప్రణబ్‌ అప్పటి ఘటనల్ని డైరీలో రాసుకున్నారు. ప్రస్తుతం ప్రణబ్ డైరీలో రాసుకున్న అంతర్గత విషయాలను ప్రణబ్ కూతురు తాను రాసిన ‘ఇన్‌ ప్రణబ్‌, మై ఫాదర్‌: ఏ డాటర్‌ రిమెంబర్స్‌’ పుస్తకంలో పేర్కొన్నారు. ఇవాళ ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పుస్తకం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story