Prayagraj: కలుషిత నీటి వల్ల కుంభమేళాలో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం: ఎన్జీటీ

by S Gopi |
Prayagraj: కలుషిత నీటి వల్ల కుంభమేళాలో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం: ఎన్జీటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రయాగ్‌రాజ్‌లోని గంగానదిలోకి మురుగునీరు చేరకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోతే మహా కుంభమేళ జాతరకు వచ్చే కోట్లాది మంది యాత్రికుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు కుంభమేళాకు వస్తారనే అంచనాలున్నాయి. 40 రోజుల పాటు జరిగే మహా కుంభమేళా జనవరి 14న మకర సంక్రాంతి 'స్నానం' (పవిత్ర స్నానం)తో ప్రారంభమై ఫిబ్రవరి 26న మహాశివరాత్రి స్నానోత్సవంతో ముగుస్తుంది. ప్రయాగ్‌రాజ్‌లోని రసూలాబాద్ నుంచి సంగం (గంగా, యమునా నది సంగమం) వరకు ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో 50 కాలువలు నేరుగా గంగా నదిలోకి మురుగునీటిని విడుదల చేస్తున్నాయని వచ్చిన దరఖాస్తును ఎన్జీటీ పరిశీలించింది. కుంభమేళా ప్రారంభానికి ముందే గంగా నదిలో మురుగునీటి విడుదలను ఆపడం ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుంది. కోట్లాది మంది ప్రజలు కుంభమేళాను సందర్శిస్తారు. మురికినీటి విడుదలను నిరోధించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోతే వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇది సున్నితమైన అంశమని ట్రిబ్యునల్ పేర్కొంది.

Next Story

Most Viewed