- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఐదు గంటలకు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 71.11 పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. డిసెంబరు 3న ఓట్ల లెక్కించనున్నారు. కాగా, మధ్యప్రదేశ్‌తో పాటు ఛత్తీస్ ఘడ్‌లోనూ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉండటంతో ఇరు రాష్ట్రాల్లోనూ పోలింగ్ సమయాల్లో మార్పులు చేశారు.
మధ్యప్రదేశ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నిర్వహించారు. మిగతా ప్రాంతాల్లో మాత్రం ఉదయ 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిర్వహించారు. ఛత్తీస్ ఘడ్‌లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరిగింది.