నిబంధనల ప్రకారమే పార్టీల హోదా రద్దు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

by Vinod kumar |
నిబంధనల ప్రకారమే పార్టీల హోదా రద్దు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
X

లక్నో: పలు పార్టీల గుర్తింపును తగ్గించడంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనల ప్రకారమే ఎన్నికల కమిషన్ పార్టీల గుర్తింపును తగ్గించిందని చెప్పారు. ప్రజల మద్దతు లేనివారు ఎప్పుడూ తగ్గుతూనే ఉంటారని అన్నారు. కాగా, సోమవారం ఎన్నికల కమిషన్ టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐల జాతీయ హోదాను రద్దు చేసింది. దీంతో పాటు ఆప్ కు జాతీయహోదా కల్పిస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు యూపీలో యాక్టివ్‌గా ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్‌కు రాష్ట్ర గుర్తింపు ఇచ్చింది.

మంగళవారం ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఠాకూర్ మాట్లాడారు. ‘ఓట్లు గెలుచుకోలేని వారు, ప్రజామోదం తగ్గినవారు నిరంతరంగా తగ్గుముఖం పడుతూనే ఉంటారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు. కాగా దేశంలో ఆరు పార్టీలకు జాతీయహోదా ఉందని ఈసీ ప్రకటించింది. వీటిలో బీజేపీ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ), సీపీఐ(ఎం), నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ), ఆప్ ఉన్నాయి.

Advertisement

Next Story