ఉత్తరప్రదేశ్ లో మైనర్ బాలుడిపై పోలీసుల కర్కశత్వం! (వీడియో వైరల్)

by Disha Web Desk 5 |
ఉత్తరప్రదేశ్ లో మైనర్ బాలుడిపై పోలీసుల కర్కశత్వం! (వీడియో వైరల్)
X

దిశ, డైనమిక్ బ్యూరో: మైనర్ బాలుడిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించి, లాక్కెల్లిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. కాన్పూర్ లోని కృపాల్ పూర్ ప్రాంతంలో ఓ ఇంటి ముందుకు పోలీస్ వాహానం వచ్చి ఆగింది. అక్కడే నిలబడి ఉన్న ఓ బాలుడిని పిలిచి వారికి కావల్సిన వివరాలు అడిగారు. అదే సమయంలో అకస్మాత్తుగా ఇద్దరు పోలీసులు ఆ బాలుడిని వాహనంలోకి ఎక్కించడానికి చొక్కాపట్టుకొని లాక్కెళ్లారు. నేనేమి తప్పు చేయలేదు నన్నేందుకు తీసుకెళుతున్నారని ఆ బాలుడు అంటున్న వినకుండా బలవంతంగా వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు.

అదే సమయంలో అక్కడే ఆడుకుంటున్న తన మైనర్ సోదరి తీసుకు వెళ్లవద్దు అని రోధించినా ఆ పోలీసుల మనసు చలించలేదు. ఆ బాలుడిని వాహనంలో తీసుకొని వెల్లిపోయారు. దీనిని వీడియో తీసిన మరో బాలుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అనంతరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ కేసు విచారణకై గ్రామానికి వచ్చిన పోలీసులతో బాలుడు అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడించారు. ఇది చూసిన నెటిజన్లు పోలీసులపై దుమ్మెత్తిపోస్తున్నారు. మైనర్ అని కూడా చూడకుండా లాక్కొని వెళతారా? ఆ సమయంలో ఆ బాలుడికి ఏమైనా జరిగితే ఎవరు భాద్యులు అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Click Here For Twitter Post

Next Story

Most Viewed