- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jharkhand: బుజ్జగింపులే హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఎజెండా- మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ నెలకొంది. కాగా.. అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుజ్జగింపులే సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వ ప్రధాన ఎంజెడా అని మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్రంలోని గర్హ్వాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ ప్రసంగించారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘బంగ్లాదేశ్‌చొరబాటుదారులు జార్ఖండ్ వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. వారి ఓట్లను పొందడానికి ప్రభుత్వం మద్దతుదారులుగా వ్యవహరిస్తోంది. సరస్వతీ గేయాన్ని పాఠశాలలో ఆలపించేందుకు అనుమతించకపోడం ఎంత పెద్ద ప్రమాదమో ఊహించుకోండి. పండుగల వేళ రాళ్ల దాడి జరుగుతోంది. కర్ఫ్యూ విధించడం, దుర్గా ర్యాలీని ఆపడం అది ఎంత ప్రమాదకరమో మీకు తెలుసు. చొరబాటు సమస్య కోర్టుకు వెళ్లినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల దుష్ట విధానాలు ఇలాగే కొనసాగితే జార్ఖండ్‌లో ఆదివాసీ సమాజం నాశనం అయిపోతుంది. కేంద్ర పథకాలను అమలు చేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటేనే జార్ఖండ్‌లో అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు.
హేమంత్ పై విమర్శలు
హేమంత్ సోరెన్ లక్ష్యంగా చేసుకొని మోడీ విమర్శలు గుప్పించారు. ‘‘మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌కు బెయిల్ లభించడంతో చంప సోరెన్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని జేఎంఎం నిర్ణయం తీసుకుంది. ఇది ఆయనకు జరిగిన తీవ్ర అన్యాయం. ఆదివాసీ బిడ్డను వారు అవమానించారు. కుటుంబం కంటే వారికి ఏది ముఖ్యం కానప్పుడు రాష్ట్ర ప్రజలను ఎలా చూసుకుంటారు. అలాంటి స్వార్థపూరిత పార్టీలకు గుణపాఠం చెప్పడం అవసరం. నాకు ఫ్యామిలీ లేదు. ప్రజలే నా కుటుంబం’’ అని మోడీ వ్యాఖ్యానించారు.