Budget session: 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాన్ని సాధించాలి- మోడీ

by Shamantha N |
Budget session: 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాన్ని సాధించాలి- మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister) అన్నారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో ప్రధాని మోడీ(Prime Minister) మాట్లాడారు. రాబోయే నాలుగేళ్లలో పార్టీలు విభేదాలను పక్కనపెట్టి పనిచేయాలని హితవు పలికారు. “మన ప్రజాస్వామ్యం (Democracy) గర్వించదగిన ప్రయాణంలో బడ్జెట్ సెషన్ ది ముఖ్యమైన గమ్యస్థానం. 60 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. మా బడ్జెట్ రాబోయే ఐదేళ్లలో దేశ ప్రయాణానికి దిశానిర్దేశం చేస్తుంది. ‘వికసిత్ భారత్’ (Viksit Bharat)కు బలమైన పునాదిని ఏర్పరుస్తుంది ”అని మోడీ అన్నారు. భారతదేశానికి అత్యున్నత అవకాశాలు ఉన్నాయని.. వచ్చే ఐదేళ్లపాటు అందరం కలిసి పనిచేయాలని అభ్యర్థించారు. 'ఏక్' (ఒకటి), 'నేక్' (నిజాయితీగా) దేశం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలన్నారు.

ప్రతిపక్షాలపై విమర్శలు

పార్లమెంటు సెషన్ లో జరిగే రగడ గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు. ప్రతిపక్షాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటు జరిగే అంతరాయల వల్ల కొంతమంది ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తకపోవడం బాధాకరమని అన్నారు. “కొన్ని పార్టీలు తమ వైఫల్యాలను దాచుకోవడానికి పార్లమెంటు సమయాన్ని వాడుకున్నాయి. గత సెషన్‌లో నన్ను మాట్లాడకుండా ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యూహాలకు స్థానం లేదు” అని ప్రధాని మోడీ అన్నారు.

Advertisement

Next Story