- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Modi: కోల్డ్ ప్లే కాన్సర్ట్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
![Modi: కోల్డ్ ప్లే కాన్సర్ట్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు Modi: కోల్డ్ ప్లే కాన్సర్ట్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు](https://www.dishadaily.com/h-upload/2025/01/28/415751-cold-play.webp)
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) బ్రిటన్‌కు చెందిన రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే గురించి ప్రస్తావించడం ఆసక్తిగా మారింది. ఒడిశా పర్యటనలో ఉన్న ప్రధాని.. తన ప్రసంగంలో ‘కోల్డ్ ప్లే (Coldplay)’ ప్రదర్శనలను ప్రస్తావించారు. కాన్సర్ట్ ఎకానమీకి బూస్ట్ ఇచ్చే దిశగా ఆలోచన చేయాలన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రెండ్రోజులపాటు జరిగే ఉత్కర్ష ఒడిశా సదస్సుకు మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కోల్డ్ ప్లే కాన్సర్ట్ గురించి మాట్లాడారు. ‘‘ముంబయి, అహ్మదాబాద్‌లో నిర్వహించిన కోల్డ్‌ప్లే కాన్సర్ట్ లను చూసే ఉంటారు. ఇలాంటి లైవ్ కాన్సర్ట్‌లకు మన దేశంలో మంచి స్కోప్ ఉందని చెప్పేందుకు ఆ షోలు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్టిస్టులు భారత్ వైపు ఆకర్షితులవుతున్నారు. గత 10ఏళ్లుగా లైవ్ ఈవెంట్లు, కాన్సర్ట్‌ల ట్రెండ్ పెరుగుతోంది. దేశంలో కాన్సర్ట్ ఎకానమీ (concert economy) రంగం ఏటా వృద్ధి చెందుతోంది. డ్యాన్స్ మ్యూజిక్, స్టోరీటెల్లింగ్ కు సంబంధించిన వారసత్వం భారత్ కు ఉంది. ఇలాంటి దేశంలో కాన్సర్ట్‌లకు విశేష ఆదరణ లభిస్తుంది. ఇందుకు తగ్గ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగాలు దృష్టి సారించాలి. కాన్సర్ట్ ఎకానమీకి మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలి’’ అని ప్రధాని సూచించారు.
భారత్ లో కోల్డ్ ప్లే కాన్సర్ట్
ఇకపోతే, మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ వరల్డ్ టూర్‌లో భాగంగా బ్రిటన్ రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే భారత్ లో సందడి చేస్తోంది. ఇటీవలే భారత్ లోని రెండు నగరాల్లో కోల్డ్ ప్లే ప్రదర్శనలిచ్చింది. భారత్‌లో ఐదు కాన్సర్ట్‌లను నిర్వహించింది. వీటికి విపరీతమైన క్రేజ్ లభించింది. ముంబయి, అహ్మదాబాద్‌లో ఇచ్చిన ఈ ప్రదర్శనలకు బాలీవుడ్, క్రీడా ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇలాంటి సమయంలో మోడీ కాన్సర్ట్ ఎకనామీ గురించి వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.