నేడు, రేపు రష్యాలో ప్రధాని మోడీ పర్యటన

by Hajipasha |
నేడు, రేపు రష్యాలో ప్రధాని మోడీ పర్యటన
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమ, మంగళవారాల్లో రష్యాలో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పాటు ఆయన మాస్కోలోనే పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. భారత్ - రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోడీ భేటీ కానున్నారు. సమకాలీన ప్రాంతీయ అంశాలు, ప్రపంచ సమస్యలపై ఇరుదేశాల నేతలు పరస్పరం చర్చించనున్నారు. ఇంతకుముందు వార్షిక శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీ వేదికగా 2021 డిసెంబర్ 6న జరిగింది. దీనిలో పాల్గొనేందుకు పుతిన్‌ మన దేశానికి వచ్చారు. గత ఐదేళ్లలో ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. చివరిసారిగా 2019 సంవత్సరంలో రష్యాలోని వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఆర్థిక సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed