మధ్యప్రదేశ్‌లో రూ.100 కోట్లతో ఆలయం.. శంకుస్థాపన చేయనున్న ప్రధాని

by Harish |   ( Updated:2023-08-11 14:28:39.0  )
మధ్యప్రదేశ్‌లో రూ.100 కోట్లతో ఆలయం.. శంకుస్థాపన చేయనున్న ప్రధాని
X

భోపాల్: ప్రధాని మోడీ శనివారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో 14వ శతాబ్దపు కవి, సంఘ సంస్కర్త సంత్ రవిదాస్‌‌కు నిర్మిస్తున్న ఆలయానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలోనూ ప్రధాని ప్రసంగిస్తారు.

సంత్ రవిదాస్‌ ఆలయం 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో సంత్ రవిదాస్‌ రచనలను ప్రదర్శించడానికి ఒక మ్యూజియం ఉంటుంది. మ్యూజియంలో నాలుగు గ్యాలరీలు ఉంటాయి. లైబ్రరీతో పాటు మీటింగ్ హాల్, వాటర్ రిజర్వాయర్, భక్తుల కోసం వసతి భవనం కూడా నిర్మించనున్నారు. 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రసాదం తయారీ కేంద్రం కూడా నిర్మిస్తారు.

రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని కోల్‌బెల్ట్ జిల్లాల నుంచి బొగ్గు సరఫరాను వేగవంతం చేసేందుకు దోహదపడే అదనపు రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయి. బొగ్గు సప్లై కోసం సాగర్ జిల్లా మీదుగా రూ.2475 కోట్లతో నిర్మించిన ఈ భారీ రైల్వే లైన్‌ను, మరో రూ.1500 కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టుల పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ పోల్స్ జరుగనున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ కూడా ఉండటంతో ప్రధాని మోడీ తరుచూ అక్కడ పర్యటిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed