- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్షలాది మంది యువ ఓటర్లతో నేడు ప్రధాని మాటామంతి
దిశ, నేషనల్ బ్యూరో : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం లక్షలాది మంది యువ ఓటర్లను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు. బీజేపీ యువజన విభాగం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా పెద్ద సంఖ్యలో యువ ఓటర్లతో ప్రధాని మోడీ సంభాషించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని దాదాపు 5,000 ప్రదేశాల నుంచి లక్షలాది మంది యువ ఓటర్లు ప్రధానితో వర్చువల్‌గా కనెక్ట్ అవుతారని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) అధ్యక్షుడు తేజస్వి సూర్య వెల్లడించారు.2014లో నరేంద్ర మోడీని ప్రధానిగా ఎన్నుకోవడంలో యువ ఓటర్లే కీలకపాత్ర పోషించారని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో యువకుల వికాసానికి అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని ఆయన తెలిపారు. మోడీజీని మూడోసారి దేశ ప్రధానిగా చేయాలనే ఉత్సాహంతో దేశ యువత ఉన్నారని పేర్కొన్నారు. మోడీ హయాంలో దేశంలో నిరుద్యోగిత రేటు ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుందని తేజస్వి సూర్య కొనియాడారు.